Telugu Current Affairs MCQs : 6th’May-2025

1. పాకిస్తాన్ ఇటీవల పరీక్షించిన “అబ్దాలి” క్షిపణి పరిధి ఎంత?

A) 120 కి.మీ
B) 320 కి.మీ
C) 450 కి.మీ
D) 750 కి.మీ

సరైన సమాధానం:C) 450 కి.మీ

వివరణ:పాకిస్తాన్ ఆర్మీ విజయవంతంగా పరీక్షించిన “అబ్దాలి” క్షిపణికి సుమారు 450 కి.మీ పరిధి ఉంది. ఇది చిన్న పరిధి బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి.


2. భారత్ ఇటీవల రష్యా నుండి పొందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏది?

A) ఎస్-400
B) బరాక్-8
C) ఇగ్లా-ఎస్ ఎయిట్ డిఫెన్స్
D) ఆకాష్

సరైన సమాధానం:C) ఇగ్లా-ఎస్

వివరణ:భారత్ రష్యా నుండి ఇగ్లా-ఎస్ మాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పొందింది. ఇది తక్కువ ఎత్తులో శత్రువు విమానాలను ఎదుర్కొనటానికి ఉపయోగపడుతుంది.


3. పహల్గామ్ దాడి అనంతరం భారత్ ఏ అంతర్జాతీయ సంస్థలో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో చేర్చాలని కోరుతోంది?

A) WTO
B) UN
C) FATF
D) ప్రపంచ బ్యాంకు

సరైన మాధానం: C) FATF

వివరణ:సపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ FATF ద్వారా పాకిస్తాన్‌ను మళ్లీ గ్రే లిస్టులో చేర్చాలని ప్రయత్నిస్తోంది.

4. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఆస్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎప్పుడు నిర్ణయం తీసుకుంది?

A) జనవరి 1, 2025
B) ఏప్రిల్ 1, 2025
C) మే 6, 2025
D) మార్చి 15, 2025

సరైన సమాధానం:B) ఏప్రిల్ 1, 2025

వివరణ:సుప్రీం కోర్టు ఏప్రిల్ 1 నుండి న్యాయమూర్తుల ఆస్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయించింది.

5. 2025లో ఖేలో ఇండియా యువ్ గేమ్స్ తొలిసారి ఏ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి?

A) బీహార్
B) తెలంగాణ
C) తమిళనాడు
D) గోవా

సరైన సమాధానం: A) బీహార్

వివరణ:ప్రధాని మోదీ మే 4న ప్రారంభించిన ఖేలో ఇండియా గేమ్స్‌ను బీహార్ తొలిసారి నిర్వహించింది.


6. IMF ప్రకారం 2025లో భారత్ ప్రపంచంలో ఏ స్థాయిలో ఆర్థిక శక్తిగా ఉంది?

A) మూడవ
B) నాలుగవ
C) ఐదవ
D) ఆరవ

సరైన సమాధానం:B) నాలుగవ

వివరణ:IMF ఏప్రిల్ 2025 ప్రకారం, భారత్ $4.39 ట్రిలియన్ GDPతో ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది.


7. “సహజోగ్” కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

A) ఒడిశా
B) బీహార్
C) తెలంగాణ
D) వెస్ట్ బెంగాల్

సరైన సమాధానం:A) ఒడిశా

వివరణ:ఒడిశా ప్రభుత్వం మే 1న పట్టణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను చేరువ చేయడానికి “సహజోగ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

8. న్యూరలింక్ సంస్థ రూపొందించిన ఏ పరికరం US FDA నుండి గుర్తింపు పొందింది?

A) మెదడు చిప్ ఆధారిత స్పీచ్ పునరుద్ధరణ పరికరం
B) యాకాలీ మందు
C) ఆటో డ్రైవింగ్ పరికరం
D) కేన్సర్ చికిత్స పరికరం

సరైన సమాధానం:A) మెదడు చిప్ ఆధారిత స్పీచ్ పునరుద్ధరణ పరికరం

వివరణ:న్యూరలింక్ సంస్థ రూపొందించిన మెదడు చిప్ టెక్నాలజీ ఆధారిత పరికరం మాట్లాడలేని వ్యక్తులకు మళ్లీ మాట్లాడే అవకాశం కల్పిస్తుంది.

9. భారత్ అభివృద్ధి చేసిన తొలి క్రిస్పర్ ఆధారిత రైస్ రకాలు ఏవి?

A) IR8 & Swarna
B) DRR Dhan 100 Kamla & Pusa DSR Rice 1
C) MTU 1010 & Samba Mahsuri
D) BPT 5204 & IC-1415

సరైన సమాధానం:B) DRR Dhan 100 Kamla & Pusa DSR Rice 1

వివరణ:ICAR శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీతో ఈ రెండు కొత్త రైస్ రకాలను అభివృద్ధి చేశారు

10. బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసే రెండవ ఆసియా దేశంగా ఏ దేశం మారుతుంది?

A) ఫిలిప్పీన్స్
B) వియత్నాం
C) ఇండోనేషియా
D) మలేషియా

సరైన సమాధానం:B) వియత్నాం

వివరణ:ఫిలిప్పీన్స్ తరువాత వియత్నాం $700 మిలియన్ విలువైన ఒప్పందం ద్వారా బ్రహ్మోస్ కొనుగోలు చేయనున్న రెండవ దేశం